అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

— రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్, 20: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మెట్‌పల్లిలో నూతనంగా మంజూరైన 3737, సామా జిక భద్రతా పింఛన్ ల ప్రొసీ డింగ్ పత్రాలు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, వెలమ సంఘ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, చైర్మన్ మైలారపు లింబాద్రి లు కలిసి పంపిణీ చేశారు.
అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్ర త కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ. రేవంత్ రెడ్డి, నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకా లను అమలు చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో మెట్‌పల్లి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన నూతన సామాజిక భద్రతా పింఛన్ ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, వెలమ సంఘ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు లు పాల్గొని నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి, నాయకత్వంలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజ నాలు అందేలా ప్రజాప్రతిని ధులు, అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ
మెట్‌పల్లి పట్టణంలో నూతనంగా మంజూరైన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాజిక భద్రతా పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రతి నెలా అందే పింఛన్ వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజ నాలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం నూతన సామాజిక భద్రతా పింఛన్ల కోసం అంది న దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. నూతన పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగు లు, ఒంటరి మహిళలు తదితర వర్గాలకు ప్రతి నెలా ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఇంకా అర్హత ఉండి పింఛన్లు పొందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి దరఖాస్తులను పరిశీ లించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. అర్హులైన వారు తమ వివరాలు, అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులకు అందజేయా లని సూచించారు. వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న వెలమ సంఘ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ, సామాజిక భద్రతా పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నిరుపేదలకు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పింఛన్ సొమ్మును వారి అవసరాలకు ఉపయోగించు కోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, డీఆర్‌డీఓ రఘువరన్, ఎంపీడీవో, తహసీల్దార్, స్థానిక చైర్మన్ మైలారపు లింబాద్రి, కౌన్సిలర్లు సర్పంచులు ఇతర నాయకులు ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related News

Latest News