ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రేవంత్‌కి చరిత్ర తెలుసు కాబట్టే గొప్ప వాళ్ళని కలుపుకొని పోతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. 2023 ఎన్నికల కంటే ముందుగు పీసీసీ గా ఒక అజెండా ప్రజల ముందు రేవంత్ ఉంచారని.. రాచరిక పాలన తీసి ప్రజా పాలన తీసుకోస్తాం అన్నారు. అందులో భాగంగా రాచరిక చిహ్నాలను తీసేస్తాం అని అర్ధమని మల్లు రవి స్పష్టంచేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా పాలనలో భాగంగానే ‘జయజయ హే’ తెలంగాణా పాటని అధికారిక గీతం చెయ్యటం.. ప్రభుత్వం అంటేనే చిహ్నం.. అది ముఖ్యమైన ‘ప్రజా చిహ్నం’ అమరవీరుల త్యాగం అని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం చనిపోయిన వాళ్లని చిహ్నంలో పెట్టాలని ప్రజా పాలన కోరుకుంటుంది. హిస్టరీ తెలియని వాళ్ళు పాలనకు అనర్హులు.. రేవంత్‌కి చరిత్ర తెలుసు కాబట్టే గొప్ప వాళ్ళని కలుపుకొని పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కాదు ప్రభుత్వం కార్యక్రమాలు.. తెలంగాణని ఇచ్చిన సోనియా గాంధీ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలిసిన సమయం ఇది అని అన్నారు.