ప్రతిపక్షం, సిద్దిపేట, జులై 01: చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిమాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఓపీ, ఏఎన్సీ చెకప్స్, ఫార్మసీలో అందుబాటులో ఉన్న మందులు, డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రభలే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైన మందులు, ల్యాబ్ పరికరాలు, రసాయనాలు ఉండేలా చూడాలన్నారు. డెంగ్యూ, మలేరియా కేసులు ఎన్ని వస్తున్నాయి, ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే విషయాలను డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఏఎన్ఎం, ఉన్నత అధికారులతో మాట్లాడారు. హరీశ్ రావు ఉచిత పరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు పేషెంట్లకు అందించాలని, వీలైనంత తర్వగా రిపోర్టులు తెప్పించి తగు వైద్యం అందించాలన్నారు.