[t4b-ticker]

స్మార్ట్ రేషన్ కార్డు.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

ప్రతిపక్షం, ఆగస్టు 17: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. సుమారు 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రేషన్ కార్డుల జాబితాలో పేర్లు ఉన్న కుటుంబాలకు దశలవారీగా స్మార్ట్ కార్డులు అందనున్నాయి. అయితే తమ కుటుంబ వివరాలు జాబితాలో ఉన్నాయా? కార్డు పరిస్థితి ఏమిటి? రేషన్ దుకాణం వివరాలు ఏంటి? అనే విషయాలను ప్రజలు ఆన్‌లైన్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు.

వివరాలు చెక్ చేసుకోవడం ఇలా..

  • ముందుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. తెలంగాణ పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్
  • వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఎఫ్‌ఎస్‌సీ సెర్చ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అనంతరం మీ రేషన్ కార్డు లేదా ఎఫ్‌ఎస్‌సీ రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • సంబంధిత జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • వెంటనే కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ కార్డు స్థితి, సంబంధిత రేషన్ దుకాణం, డీలర్ వివరాలు వంటి సమాచారం తెరపై కనిపిస్తుంది.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేపథ్యంలో ప్రజలు తమ వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు కనిపించకపోయినా లేదా తప్పులు ఉన్నట్లు గుర్తించినా సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Spread the love

Related News

Latest News