పేదలకు అండగా ‘మేఘన్న’ సాయం..!

•34 నెలల్లో 7,872 మందికి రూ.19.98 కోట్ల ఆర్థికసాయం

•ఎల్‌ఓసీ ద్వారా 469 మందికి రూ.9.18 కోట్ల వైద్యసాయం

•సీఎంఆర్‌ఎఫ్‌ సాయం పొందిన లబ్ధిదారుల సంఖ్యలో రాష్ట్రంలోనే వనపర్తి రెండో స్థానంలో

•దరఖాస్తు నుంచి మంజూరు వరకు ప్రత్యేక పర్యవేక్షణ

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 01, ప్రతిపక్షం: అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా అండగా నిలిచేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గత 34 నెలల్లో నియోజకవర్గానికి చెందిన 7,872 మంది లబ్ధిదారులకు రూ.19,98,40,700 సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందినట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించారు.సీఎంఆర్‌ఎఫ్‌ సాయం పొందిన లబ్ధిదారుల సంఖ్యలో వనపర్తి రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది.అత్యవసరంగా ఖరీదైన వైద్యం అవసరమైన వారికి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌ఓసీ) ద్వారా కూడా ఆర్థికసాయం అందిస్తున్నారు.ఇప్పటివరకు 469 మందికి రూ.9,18,50,000 విలువైన ఎల్‌ఓసీ సాయం అందించినట్లు తెలిపారు.

ప్రత్యేక పర్యవేక్షణ..

సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌ఓసీ దరఖాస్తుల కోసం ప్రజలు వనపర్తి నుంచి హైదరాబాద్‌ వరకు తిరగాల్సిన అవసరం లేకుండా రెండు ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి దరఖాస్తు, అవసరమైన పత్రాల సమీకరణ, ఆన్‌లైన్‌ నమోదు, సంబంధిత అధికారులతో సమన్వయం, సాయం మంజూరు వరకు ప్రతి దశను ఎమ్మెల్యే కార్యాలయం పర్యవేక్షిస్తున్నరు

నెలకు వేల దరఖాస్తులు..

సీఎంఆర్‌ఎఫ్‌ కోసం ప్రతి నెలా సుమారు 1,200 నుంచి 1,500 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను నమోదు చేస్తున్నరు అత్యవసర వైద్య అవసరాలున్న వారికి నెలకు సుమారు 15 నుంచి 20 ఎల్‌ఓసీ కేసుల పరిష్కారానికి కృషి చేసి లబ్ధిదారులకు కనిష్ఠంగా రూ.10 వేల నుంచి రూ.5–6 లక్షల వరకు వివిధ స్థాయిల్లో ఆర్థికసాయం అందజేస్తున్నారు.

పార్టీలకతీతంగా సాయం..

ఆపదలో ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి పార్టీలకతీతంగా ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు ఎమ్మెల్యే కార్యాలయం చర్యలు చేపట్టారు.అనారోగ్యం కారణంగా కుటుంబాలు అప్పులపాలు కాకుండా, డబ్బుల కొరతతో మెరుగైన వైద్యానికి దూరం కాకుండా ప్రభుత్వ సహాయాన్ని సకాలంలో అందించడమే లక్ష్యంగా సేవలు కొనసాగిస్తున్నరు

ఆపదలో అండగా.. మేఘారెడ్డి..

పేద కుటుంబంలో అనారోగ్యం తలెత్తితే వైద్య ఖర్చులతో కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసే కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌ఓసీ ద్వారా అండగా నిలిచేలా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.గత 34 నెలల్లో 7,872 మంది లబ్ధిదారులకు రూ.19.98 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందిచారు.అత్యవసర, ఖరీదైన వైద్యం అవసరమైన మరో 469 మందికి రూ.9.18 కోట్ల ఎల్‌ఓసీ సాయం అందజేస్తున్నారు.దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి దరఖాస్తు నుంచి మంజూరు వరకు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫైల్‌గా కాకుండా బాధిత కుటుంబ సమస్యగా పరిగణించి సహకారం అందిస్తున్నట్లు పేర్కొంన్నారు.అర్హత ఉన్న వారికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

Spread the love

Related News

Latest News