జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన

  • ఆరు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి
  • టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్ర శేఖర్
  • జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్ర ‘ను కలిసి వినతిపత్రం అందజేత

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, అక్టోబర్ 2: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్ర శేఖర్ లు డిమాండ్ చేశారు.ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పాలనాధికారికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. మీడియా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మీడియా సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, రద్దు చేసిన చట్టాల స్థానంలో జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. .జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించి, నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలన్నారు.పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు మీడియా కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిలిపి వేసిన రైల్వే పసులు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేసి క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించాలని టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు.

టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఎలగందుల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్,ఉపాధ్యక్షులు ఎండి షుకూర్,సంయుక్త కార్యదర్శులు దాడి సంపత్ కోశాధికారి గాజుల వెంకటేష్, యూ. రవీందర్, సీనియర్ నాయకులు కే విజయందర్ రెడ్డి అనుబంధ కమిటీ ల నాయకులు ఈద మధుకర్, మహీంద్రా చారి, ఎంఎ అసద్, వి సదానందం, జక్కుల సుమ బీ సతీష్, జిల్లా కార్య వర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, కే గంగరాజు, ఎలిగేటి శ్రీనివాస్, కే వేణు గోపాల్, బుర్ర తిరుపతి, కంకణాల రఘు, రేగుల నర్సింగం, సిరిసిల్ల అనిల్ కుమార్, బుర్ర పరుశురాం గౌడ్, బీ సదానందం లతో పాటు ప్రింట్ అండ్ ఎలక్రానిక్ మీడియా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

.

Spread the love

Related News

Latest News