జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

*చండూరులో టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో ర్యాలీ – గాంధీ విగ్రహానికి వినతిపత్రం .

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 02: టీయూడబ్ల్యూజే-ఐజేయూ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం శుక్రవారం చండూరులో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకున్న జర్నలిస్టులు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం, భద్రతకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు.
*ప్రధాన డిమాండ్లు:

  • జర్నలిస్టులకు సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం
  • జర్నలిస్టులు మరియు మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తీసుకురావడం
  • వర్కింగ్ జర్నలిస్టులకు చట్టబద్ధమైన రక్షణలను పునరుద్ధరించడం
  • మీడియా ఉద్యోగుల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయడం
  • అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించడం
  • ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడం

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కేసాని శ్రీధర్ రెడ్డి, చండూరు టీయూడబ్ల్యూజే-ఐజేయూ మండల అధ్యక్షుడు కర్నాటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్, కోశాధికారి నారబత్తుల రవీంద్ర చారి, నియోజకవర్గ అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎరుకల వంశీ తదితరులతో పాటు నల్ల స్వామి, మాదగోని శ్రీనివాస్, గంట శ్రీను, మాదగోని ఆంజనేయులు, గంట విజయ్, సంగెపు మల్లేష్, జయకృష్ణ, ఆవుల శేఖర్, జక్కలి నాగరాజు, సంగెపు మల్లిఖార్జున్, దోటి లింగస్వామి, అబ్బరబోయిన రవి తదితర పలువురు జర్నలిస్టులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News