*జ్ఞాపకాలను నెమరువేసుకున్న గ్రామ యువకులు .
ప్రతి పక్షం – చండూరు, అక్టోబర్ 04: చండూరు మండలం కస్తాల గ్రామంలో దివంగత గంట బాలు జయంతి వేడుకలను గ్రామ యువకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయనతో గడిపిన మధుర జ్ఞాపకాలను యువకులు నెమరువేసుకున్నారు.గంట బాలు ఎల్లప్పుడూ నవ్వుతూ, అందరితో కలిసి మెలిసి ఉండేవాడని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు, యువకులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





























