*పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం .
*మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు
ప్రతి పక్షం – చండూరు, అక్టోబర్ 06: దసరా పండుగను పురస్కరించుకొని చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు హాజరై కార్మికులకు స్వయంగా దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమన్నారు. వారు ఎండనకా వాననకా రేయింబవళ్లు కష్టపడి పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పండుగ సందర్భంగా వారికి దుస్తులు అందించడం ఎంతో సంతోషంగా ఉందని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తున్నారని, వారి కృషి వల్లనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు, సామ సుజాత యాదవ్ రెడ్డి, కొన్రెడ్డి మధు, కోడి సుష్మ వెంకన్న, కలిమికొండ పారిజాత జనార్ధన్, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, కల్లెట్ల చంద్రకళ మారయ్య, మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, జూనియర్ అసిస్టెంట్ ఏ. జగన్, వార్డ్ ఆఫీసర్లు జి. శ్రీరాములు, బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.































