అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చేందుకు ఇదే చివరి అవకాశం.

— ASDD, జాబితాలో ఉన్న ఓటర్లు ఎన్యూమ రేషన్ ఫారంతో పాటు సంబంధిత అనెక్సర్ సమర్పించాలి
— రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.

— జగిత్యాల జిల్లాలో 74,738 మంది ఓటర్లు ASDD, జాబితాలో నమోదు.

ప్రతిపక్షం, జగిత్యాల, (ప్రతినిధి) నవంబర్ 21: హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నివాసం మార్చుకోని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంతో పాటు అనెక్సర్ ‘బి’ ను, రాష్ట్రంలోనే మరో ప్రాంతా నికి నివాసం మార్చుకున్న ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంతో పాటు అనెక్సర్ ‘సి’ను సమర్పించాలని పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో చేర్చేందు కు ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చోటు కల్పిం చేందుకు ఇది చివరి అవకాశమని తెలిపారు. ASDD (గైర్హాజరు, నివాస మార్పిడి, మరణించిన మరియు నకిలీ ఓటర్లు) జాబితాలో నమోదైన వారిలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని సీఈఓ సూచించినట్లు తెలిపారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 74,738, మంది ఓటర్లు ASDD, జాబితాలో నమోదయ్యా రని, సంబంధిత ఓటర్లు సూచించిన పత్రాలను సమర్పించి ఓటర్ల జాబితా లో తమ పేర్లను నిర్ధారించు కోవాలని కోరారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని విజ్ఞప్తి చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు, మధుసూదన్, జీవాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News