[t4b-ticker]

భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ఇదొక్కటి పాటించండి.. గరికిపాటి కీలక సూచనలు!

ప్రతిపక్షం, ఆగస్టు 10: చిన్నచిన్న అపార్థాలు, గొడవలు, ఈగోలు కారణంగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగి చివరకు కుటుంబ బంధాలు తెగిపోతున్న ఘటనలు నేటి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు దాంపత్య జీవితం గురించి కీలక సూచనలు చేశారు.

భార్యాభర్తలు ఏ పరిస్థితి ఎదురైనా బహిరంగంగా ఒకరినొకరు సమర్థించుకోవాలని ఆయన సూచించారు. నలుగురిలో ఉన్నప్పుడు భాగస్వామిని కించపరచడం, అవమానించడం లేదా తప్పుబట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పేర్కొన్నారు.

దంపతుల మధ్య వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు, అపార్థాలు, అభిప్రాయ భేదాలను ఇంట్లోనే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. తమ కుటుంబ విషయాలను బయటకు తీసుకెళ్లి ఇతరుల ముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల సమస్య మరింత పెద్దదవుతుందని తెలిపారు.

భార్యాభర్తల్లో ఎవరి తప్పు ఉన్నా దాన్ని నలుగురిలో ఎత్తిచూపడం కంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమగా చెప్పి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని గరికిపాటి సూచించారు. భాగస్వామి గౌరవాన్ని కాపాడటం దాంపత్య బంధంలో ఎంతో ముఖ్యమని వివరించారు.

నలుగురిలో భాగస్వామికి అండగా నిలవడం.. ఇంట్లో సమస్యలను మాట్లాడుకుని పరిష్కరించుకోవడం.. ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అలవాట్లు ఉంటే దాంపత్య బంధం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News