[t4b-ticker]

తల్లిదండ్రులకు సేవ చేయడం అదృష్టం.. నాగార్జున భావోద్వేగ వ్యాఖ్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 11: తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం, వారికి సేవ చేయడం ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. చిన్నతనంలో తమకు భయం వేసినా, అనారోగ్యంతో బాధపడినా చేయి పట్టుకుని ధైర్యం చెప్పిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుందని పేర్కొన్నారు.

‘పళ్ళబురుసు’ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున.. తల్లిదండ్రులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను తన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకున్నానని తెలిపారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారని.. వయసు పెరిగిన తర్వాత వారికి అదే ప్రేమను తిరిగి ఇవ్వడం మన బాధ్యత అని చెప్పారు.

తన ఇంట్లో అమల కూడా ఆమె తల్లిదండ్రులను ఎంతో శ్రద్ధగా చూసుకుంటారని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం 88, 90 ఏళ్ల వయసులో ఉన్న ఆమె తల్లిదండ్రులకు అమల సేవలు చేస్తోందని చెప్పారు. అందుకే ‘నీ కంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరు’ అని అమలతో తరచూ చెబుతుంటానని నాగార్జున వెల్లడించారు.

తల్లిదండ్రులకు సేవ చేయడానికి అవకాశం రావడం గొప్ప అదృష్టమని, వారిని చూసుకోవడం భారంగా భావించకూడదని నాగార్జున సూచించారు. మన కోసం జీవితాన్ని అంకితం చేసిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలవడం పిల్లల బాధ్యత అని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News