[t4b-ticker]

ఐదేళ్లుగా కూతురిపై లైంగిక దాడి

ప్రతిపక్షం, ఆగస్టు 22: హైదరాబాద్‌లో కన్నతండ్రి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్లుగా తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బాలిక పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నర్కిపూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన నిందితుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గురువారం రాత్రి తన 12 ఏళ్ల పెద్ద కుమార్తెపై మరోసారి లైంగిక దాడికి ప్రయత్నించగా బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. అనంతరం ధైర్యం చేసి డయల్‌ 100కు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు.

పోలీసులు బాలికను విచారించగా మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాలిక వాపోయినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

బాలికకు అవసరమైన రక్షణ, సహాయం అందించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News