మృతుల కుటుంబాలను పరామర్శించిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
కష్టకాలంలో అండగా ఉంటానని హామీ.. బాధిత కుటుంబాలకు మనోధైర్యం
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 05: ఆప్తులను కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పరామర్శించి అండగా నిలిచారు. మృతుల పార్థివదేహాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.హవెలిఘనపూర్ మండలం బూరుపల్లి మాజీ సర్పంచ్ చెన్న గౌడ్ తండ్రి కిష్ట గౌడ్ ఆదివారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తిరుపతిరెడ్డి బూరుపల్లికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చెన్న గౌడ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరం సుల్తాన్‌పూర్ తండాకు చెందిన అరిగి శ్రావణి ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అలాగే స్కూల్ తండాకు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు రంజిత్ నాయక్ తండ్రి కేతావత్ రూప్‌సింగ్ నాయక్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.
రంజిత్ నాయక్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.రూప్‌సింగ్ నాయక్ మృతి బాధాకరమని పేర్కొన్న తిరుపతిరెడ్డి, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యారెడ్డి, సర్పంచులు సాయిలు, రమేష్, ఉపసర్పంచులు లెంక రాజు, వడ్ల రాజు, అరిగే కిష్టయ్య, మాజీ సర్పంచులు శ్రీహరి, మాజీ ఉపసర్పంచ్ సాయిబాబా, విట్ఠల్, నాయకులు రామచంద్రరెడ్డి, కుర్మా పోచయ్య, రవి, నరేందర్‌రెడ్డి, గంగేల్లి నర్సింలు, ప్రతాపరెడ్డి, మూగ లక్ష్మయ్య, కిరణ్ గౌడ్, చంద్రమోహన్ గౌడ్, జగదీష్, నాగరాజు, స్వామి నాయక్, జైపాల్‌రెడ్డి, వడ్ల నాగరాజు, రమేష్, సూర్య నాయక్, గోపాల్ నాయక్, లక్ష్మీపతి, శ్రీహరి, సాప సాయిలు, అరిగే పోచయ్య, రాజేశ్వర్‌రావు, సతీష్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
































