*వికసిత్ భారత్ సంకల్ప సభ.
*నల్గొండలో సేవా జ్యోతి యాత్రలో బీజేపీ శ్రేణులు.
ప్రతి పక్షం – నల్గొండ అక్టోబర్ 07 : 25 ఏళ్లు ఒక మనిషి జీవితంలో ఒక పెద్ద కాలం… కానీ దేశం కోసం, ప్రజల కోసం అంకితం చేసిన 25 ఏళ్లు… ఒక చరిత్ర! గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ సంకల్ప సభ – సేవా జ్యోతి యాత్ర” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అధికారం కోసం కాదు… ఆడంబరం కోసం కాదు… స్వార్థం కోసం కాదు… దేశం కోసం తన జీవితంలోని విలువైన సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేయడం అదే ఒక సేవకుడి నిజమైన గొప్పతనం. ఎన్నో ఒడిదుడుకులు… ఎన్నో సవాళ్లు… ఎన్నో విమర్శలు… ఎన్నో పరీక్షలు ఎదురైనా, ప్రజాసేవ అనే మార్గంలో ముందుకు సాగిన 25 ఏళ్ల ప్రస్థానం ప్రతి కార్యకర్తలో ఒక కొత్త ఆశను, ఒక కొత్త సంకల్పాన్ని నింపుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ వర్చువల్ విధానంలో అందించిన సందేశాలను కార్యకర్తలు విన్నారు. ఆ మాటలు కేవలం ఒక ప్రసంగంలా కాకుండా దేశం కోసం పనిచేయాలనే బాధ్యతను గుర్తు చేసిన పిలుపులా అనిపించాయని, దేశం ముందుకు సాగితేనే మనం ముందుకు సాగినట్టు, ప్రజల జీవితాల్లో మార్పు వస్తేనే సేవకు అర్థం, భారత్ వికసిస్తేనే సంకల్పం నెరవేరినట్టని తెలిపారు.సేవకు అంతం లేదు… సంకల్పానికి విరామం లేదు… దేశం కోసం మన ప్రయాణానికి ముగింపు లేదు అని నినదించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






























