[t4b-ticker]

LPG ఈ-కేవైసీ గడువు పొడిగింపు

ప్రతిపక్షం, ఆగస్టు 15: ఎల్పీజీ వినియోగదారులకు సంబంధించిన ఈ-కేవైసీ గడువుపై కీలక సమాచారం వెలువడింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు గ్యాస్ కంపెనీలు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు సమాచారం. అయితే దీనిపై ఆయా గ్యాస్ కంపెనీల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

వాస్తవానికి ఈ నెల 16వ తేదీని ఎల్పీజీ ఈ-కేవైసీకి చివరి తేదీగా పేర్కొన్నారు. అయితే చివరి తేదీ సమీపించడంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొంతమంది వినియోగదారులు ప్రక్రియను పూర్తి చేయలేకపోయినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ గడువును మరోసారి పొడిగించినట్లు పలువురు వినియోగదారులకు సందేశాలు వచ్చినట్లు సమాచారం. అందులో ఈ నెల 23వ తేదీ వరకు ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ గడువు పొడిగింపుపై గ్యాస్ కంపెనీలు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వినియోగదారులు తమకు వచ్చిన సందేశాలను పరిశీలించడంతో పాటు, అధికారిక గ్యాస్ సంస్థల యాప్‌లు లేదా వెబ్‌సైట్లలో లభించే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచిస్తున్నారు.

ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిన వినియోగదారులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

Spread the love

Related News

Latest News