గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

ప్రతి పక్షం నల్గొండ అక్టోబర్ 02: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు.పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో నడిచిన మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి, అభివృద్ధికి దిశానిర్దేశం చేశారని కొనియాడారు. గాంధీజీ బోధించిన విలువలు, ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ ముందంజలో ఉండాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News