ధాన్యం లేక రెండు రైస్ మిల్లులు సీజ్

రూ.65 లక్షల బకాయిలపై సివిల్ సప్లై అధికారుల తనిఖీలు

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 05: ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం బకాయిలకు సంబంధించి సివిల్ సప్లై అధికారులు చేపట్టిన తనిఖీల్లో రెండు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని విజయదుర్గ రైస్ మిల్, నర్సాపూర్ మండలంలోని ఏకే ట్రేడర్స్ రైస్ మిల్‌ను అధికారులు తనిఖీ చేశారు.తనిఖీల సమయంలో మిల్లుల్లో ధాన్యం అందుబాటులో లేకపోవడంతో పాటు యజమానులు కూడా అందుబాటులో లేకపోవడంతో మిల్లులకు తాళాలు వేసి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.65 లక్షలు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.ఈ మేరకు మిల్లులపై కేసులు నమోదు చేసినట్లు ఏసీఎస్‌ఓ నిస్సార్, సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్లు నర్సింహులు, నాగరాజు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం బకాయిల విషయంలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News