ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, అక్టోబర్ 06: అక్రమంగా తొలగించబడిన ఓట్లను పునరుద్ధరణ చేయాలని
ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్,ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల ఆధ్వర్యంలో కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ కనుసన్నల్లో ఎలక్షన కమిషన్ వ్యవహరించడం అత్యంత దుర్మార్గపు చర్య అని,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి .ఆర్ అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును తొలగిస్తూ,మునుపెన్నడూ లేని విధంగా లక్షాది మంది ఓట్ల తొలగింపు చేయడం ఎలక్షన్ కమిషన్ కు చీఫ్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ కు తగదని, జ్ఞానేష్ కుమార్ ను బీజేపీ ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదని,ఆయన వెనుక ఉండి నడిపిస్తున్న బీజేపీ కుట్రలను ఇండియా కూటమి తిప్పికొడుతుందని,దేశ వ్యాప్త ఉద్యమం తీవ్ర రూపం దాల్చాక ముందే ఆయనను తొలగించాలని లేనిపక్షంలో జిల్లాల్లో మొదలైన ఉద్యమ ఢిల్లీ నడిబొడ్డుకు చేరక తప్పదని బీజేపీ ప్రభుత్వాన్ని శ్రీనివాస్ హెచ్చరించారు.
సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నాగెల్లి లక్ష్మారెడ్డి,గూడెం లక్ష్మీ, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు బండ రాజిరెడ్డి,గోవిందుల రవి, చొక్కల్ల శ్రీశైలం, ఉమ్మెంతల రవీందర్ రెడ్డి,గజ్జి అయిలయ్య,పైడిపల్లి రాజు,చాడ శ్రీధర్ రెడ్డి,అందె చిన్న స్వామి, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,మచ్చ రమేష్,బామండ్లపెల్లి యుగేందర్,నలువాల సదానందం, కాంతాల అంజిరెడ్డి,కొట్టె అంజలి,బోయిని వల్లభాయ్ పటేల్, తేరాల సత్యనారాయణ, ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎ. ఐ. వై.ఎఫ్ జిల్లా అధ్యక్షులు నునావత్ శ్రీనివాస్, పోలోజు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.





























