మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.

విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు.

చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు.

ప్రతి పక్షం – చండూరు, అక్టోబర్ 06: మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను అభినందిస్తూ, వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించే కార్యక్రమం ఈరోజు చండూరులో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమాజంలో గురువులకు ఉన్నత స్థానం ఉందని, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. యాదగిరి, మండల విద్యాధికారి ఊట్కూరు సుధాకర్ రెడ్డి, తుమ్మలపల్లి సర్పంచ్ బోయపల్లి రాజేష్, వివిధ ఉపాధ్యాయ సంఘాల మండల అధ్యక్షులు, ఎంఆర్సీ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

*అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు:
రావిరాల అరుణ – స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), ఎస్.కె. మజీద్ – స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), అనిల్ కుమార్ – స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్), కే. సత్యవతి – ఎస్జీటీ, ఎన్. అనిత – ఎస్జీటీ, బి. చైతన్య – ఎస్జీటీ, కే. శరత్ బాబు – ఎస్జీటీ, జి. శ్రీనివాసులు – ఎస్జీటీ, కె. అనిత – ఎస్జీటీ, ఆర్. చౌకీసింగ్ – ఎస్జీటీ, ఆరంజ్యోతి – కేజీబీవీ.

ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.

Spread the love

Related News

Latest News