ప్రతిపక్షం, నవంబర్ 21: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన ఇవాళ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధిష్ఠానం చాహల్‌కు పార్టీ అనుబంధ విభాగమైన ఓబీసీ మోర్చాలో కీలక బాధ్యత అప్పగించింది. ఓబీసీ మోర్చా జాతీయ బృందంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా (స్పెషల్ ఇన్వైటీ) చాహల్‌ను నియమిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. ఈ నియామకంతో క్రికెట్ మైదానంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న చాహల్ రాజకీయ రంగంలోనూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.
ఇటీవల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో చాహల్ సమావేశమైనట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఆయన బీజేపీలో చేరడంతో పాటు జాతీయ స్థాయి బాధ్యతను స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ ఓబీసీ మోర్చా సంస్థాగత కార్యకలాపాల్లో చాహల్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


























