[t4b-ticker]

మంత్రి వివేక్‌ సంచలన వ్యాఖ్యలు.. ‘ప్రభుత్వం దిగిపోతుంది’ అంటూ కామెంట్స్

ప్రతిపక్షం, ఆగస్టు 22: హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమావేశంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోయే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా దిగిపోతుందని ఆయన విద్యార్థులతో అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

“వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా.. ప్రభుత్వం దిగిపోతుంది. నా గ్యారెంటీతో మీకు ఏం ప్రయోజనం?” అంటూ మంత్రి వ్యాఖ్యానించినట్లు వీడియోలో కనిపిస్తోంది. విద్యార్థులకు హామీలు ఇచ్చినా ప్రభుత్వం మారితే వాటి అమలు ఎలా జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో మంత్రి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మంత్రి వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయమా, లేక ప్రభుత్వ భవిష్యత్తుపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలా అనే అంశంపై చర్చ జరుగుతోంది.

Spread the love

Related News

Latest News