ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు చేరిక
ప్రతిపక్షం, అక్టోబర్ 07, హైదరాబాద్ : నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్య తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులతో కలిసి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో బుధవారం వారికి టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచులు టేకం లక్ష్మణ్, గడ్డం భీముడు, కె. రాజేందర్, కస్తూరి అర్జున్, శ్రీపెల్లి శేఖర్, ఉప సర్పంచులు పి. రాజు, చింటు కాంతి, గంపల భూమన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు రామ్ సింగ్, షిండే సదాశివ, మాజీ సర్పంచులు ఎ. శంకర్, నాయకపోడ్, కోలం సంఘాల ప్రముఖులు, నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. నిర్మల్ జిల్లాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని, నాయకులంతా సమన్వయంతో పని చేయాలని వారికి కవిత సూచించారు. ఈనెలలో ఇంద్రవెల్లిలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.






























