కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలు వద్దు

  • కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలి
  • కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

ప్రతిపక్షం, హన్మకొండ, నవంబర్ 22: ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సీఎం ఈ మేరకు స్పందించినట్లు సమాచారం. కాళోజీ కళాక్షేత్రంలో ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలనూ ఏర్పాటు చేయవద్దని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాళోజీ ఫౌండేషన్‌ సభ్యులతో చర్చించి, కళాక్షేత్రంలో నిర్వహించాల్సిన కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ఖరారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు సమాచారం.

Related News