- అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
- కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
ప్రతిపక్షం, యూసుఫ్‌గూడ, నవంబర్ 22: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీసీ సురేష్ కుమార్, అరుణ్ కుమార్, శ్రీనివాస్, ఐశ్వర్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.






























