పెగడపల్లిలో స్వగృహంలో కన్నుమూత
పార్థివదేహానికి నివాళులర్పించిన దాస్యం వినయ్ భాస్కర్
ప్రతిపక్షం, పెగడపల్లి, నవంబర్ 22: పెగడపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ మాతృమూర్తి నరెడ్ల పద్మక్క శనివారం పెగడపల్లిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతి వ్యక్తిగతంగా తీరని లోటని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పద్మక్క మరణవార్త తెలుసుకున్న వినయ్ భాస్కర్ ఆమె నివాసానికి చేరుకుని పార్థివదేహంపై పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం మేనల్లుడు నరెడ్ల శ్రీధర్, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.






























