అఖిల భారత రైతు మహాసభలను జయప్రదం చేయండి.

*నల్లగొండలో అఖిల భారత రైతు మహాసభలు – జయప్రదం చేయాలని పిలుపు.

*వీర తెలంగాణ పోరాటానికి 80 ఏళ్లు – నల్లగొండ వేదికగా చారిత్రాత్మక సభలు.

*కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో సంక్షోభంలోకి రైతాంగం.

*సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం .

ప్రతి పక్షం చండూరు, అక్టోబర్ 04 : నల్లగొండలో నవంబర్ 15 నుండి 18 వరకు జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు.ఆదివారం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ, విరాళాల సేకరణ చేపట్టారు.
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, వీర తెలంగాణ పోరాటానికి కేంద్రంగా నిలిచిన నల్లగొండలో ఈ జాతీయ మహాసభలు జరుగుతుండటం చారిత్రాత్మకమన్నారు.కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలతో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, యూకే లతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దిగుమతి సుంకాలు లేకుండా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ధాన్యాలు, పాల ఉత్పత్తులు దేశంలోకి వస్తే భారత రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయ సబ్సిడీలు పెంచాలని, రైతులను రుణ విముక్తులను చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి ఉపసర్పంచ్ సరికొండ ముత్యాలు, స్వామి, జంగయ్య, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News