రైతులకు 12 గంటల కరెంటు ఇవ్వాలి

నిజాంపేట సబ్‌స్టేషన్‌ ఎదుట బీఆర్ఎస్‌ రాస్తారోకో

రైతుల పంటలు ఎండుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది?

బీఆర్ఎస్‌ నేత కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 08: రైతులకు 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నిజాంపేటలో గురువారం నిరసన చేపట్టారు. బీఆర్ఎస్‌ మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించి నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆందోళనకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ నేత తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి కనీసం 12 గంటల విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

అనంతరం రామాయంపేట ఏఈ ఆదయ్య ఆందోళన స్థలానికి చేరుకుని నాయకులతో చర్చించారు. రైతులకు 12 గంటల విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్‌ నాయకులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో రైతులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News