*కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ .
ప్రతి పక్షం మర్రిగూడెం అక్టోబర్ 08: లెంకలపల్లి గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేసిన సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ కు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రం అందజేశారు.నల్లగొండ జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ సర్పంచ్ గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గ్రామంలో టీబీ నిర్మూలన కోసం ప్రత్యేక చొరవ తీసుకొని, ప్రజల్లో అవగాహన కల్పించి, వైద్య పరీక్షలు నిర్వహించడంలో సర్పంచ్ చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించింది.ఈ సందర్భంగా సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ టీబీ రహిత గ్రామ ఏర్పాటుకు సహకరించిన ఏఎన్ఎం గారికి, ఆశా వర్కర్లకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజలందరి సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని, భవిష్యత్తులో కూడా గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.




























