ఎమ్మెల్యే రోహిత్‌పై తప్పుడు ప్రచారానికి చెక్‌ పెట్టాలి

సోషల్‌ మీడియాలో అసత్య పోస్టులపై పోలీసులకు కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 08: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుపై సోషల్‌ మీడియా, మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్ పట్టణ, రూరల్ పోలీస్‌ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ దొంతి నరేష్‌గౌడ్, కాంగ్రెస్‌ నేత భూపతిరాజు గంగాధర్ ఆధ్వర్యంలో నాయకులు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు, అసభ్యకర పోస్టులు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యేపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో రాగి అశోక్, అవార శేఖర్, గోదల సాయి, నవీన్‌కుమార్, మస్కూర్ సంతోష్, బాలరాజ్, నవీన్, సున్నం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News