*బంగారం రికవరీ వివాదం – కీలక అధికారి అండతో మరో అధికారికి రక్షణ?
*ఎస్ఐ పై వేటు – మరో అధికారిపై చర్యలు లేవని విమర్శలు.
ప్రతి పక్షం – నల్లగొండ అక్టోబర్ 08 : నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం రికవరీ వివాదం రచ్చకెక్కింది. దొంగతనం కేసులో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారంలో కొంత పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆరోపణల నేపథ్యంలో నార్కట్ పల్లి ఎస్ఐ పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఎస్ఐ ని జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మరో అధికారిపై కూడా ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై పోలీస్ శాఖలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలక పోలీస్ అధికారితో సాన్నిహిత్యం కారణంగానే ఆ అధికారికి రక్షణ లభిస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిష్పక్షపాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.





























