ప్రతిపక్షం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్22: కుంగ్-ఫూ డూ అండ్ సన్నీ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ, ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ లోని వాసవి ఫంక్షన్ హాల్, గుండి రోడ్ లో 7వ నేషనల్ లెవల్ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే – కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్ – 2026 ఘనంగా నిర్వహించబడింది.ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. ఆడపిల్లలు తప్పనిసరిగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి జాతీయ స్థాయి పోటీలను ఆసిఫాబాద్ లో నిర్వహించడం గర్వకారణమని, నిర్వాహకులను అభినందించారు.
ఈ ఛాంపియన్ షిప్ లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వందలాది మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ , వైస్ చైర్మన్ అహమద్ , గ్రాండ్ మాస్టర్ ఫౌండర్ డి. కాంతేశ్వర్ , ప్రెసిడెంట్ పి. మోహన్ , జనరల్ సెక్రటరీ ఆర్. శ్రీనివాస్ , చైర్మన్ బి. బూమయ్య , టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఒరగంటి శ్రవణ్ , కుదుకుడే సంతోష్ , ఎం. హరికృష్ణ వివిధ రాష్ట్రాల చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.























