ఇందిరమ్మ బీమాపై ఇంటింటా అవగాహన

అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తాం

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న

ప్రతిపక్షం ప్రతినిధి, కడెం, నవంబర్ 22: మండలంలోని ఎలగడప గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పథకం ఉద్దేశం, అర్హతలు,ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అర్హులైన కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కడం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుందని, కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో కడం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులకు వాటి ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.సంక్షేమ పథకాలపై ప్రజలకు సరైన సమాచారం అందినప్పుడే వాటి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరుతాయని, అందుకే గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేపడుతున్నట్లు వివరించారు.ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్హత కలిగిన వారు నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత కేంద్రాల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని గంగన్న కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హస్విత రమేష్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒంటికారి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి ముస్కు రాజేందర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ సలీం, ఏఎంసీ డైరెక్టర్ నారాయణ, పీఏసీఎస్ డైరెక్టర్ భూమరాజం, గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేష్, అధికార ప్రతినిధి రాజేందర్, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడు పోషన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related News

Latest News