తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరిన యువకులు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 23: తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి యువత చేరికలు పెరుగుతున్నాయి. మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బట్టి అజయ్ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు యువకులు ఆదివారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు బట్టి అజయ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు సతీష్, గుట్టకిందిపల్లి పార్టీ అధ్యక్షుడు పిట్ల రాజశేఖర్, మెదక్ టౌన్ యువజన విభాగం అధ్యక్షుడు చౌదరి భాను, మెదక్ మండల సోషల్ మీడియా అధ్యక్షుడు రెహాన్, మెదక్ పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయికిరణ్ ముదిరాజ్, నాయకులు చరణ్, అయాన్, ఇమ్రోజ్, మధు కార్తీక్, గుట్టకిందిపల్లి అరుణ్ తదితరులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

Latest News