Trending Now

రిమ్స్‌లో సూపర్‌వైజర్ వేధింపులు.. మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 15 : అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ప్రధాన ఆసుపత్రిలో పేషెంట్ కేర్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన ఆదిలాబాద్ రిమ్స్ ప్రధాన ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన ఎంఐసియు వార్డుకు తరలించి ఆమెకు అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. ఆస్పత్రి సూపర్ వైజర్ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పూర్తిస్థాయి వాస్తవ వివరాలు తెలియవలసి ఉంది.

Spread the love

Related News

Latest News