ప్రతి పక్షం మునుగోడు అక్టోబర్ 08: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు కంటి చికిత్సలు అందిస్తున్నారు. కంటి శిబిరాలతో పాటు సమీక్ష శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మునుగోడులో నిర్వహించిన వైద్య సమీక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో గతంలో గుర్తించిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.సమీక్షకు హాజరు కావాల్సిన 43 మంది రోగుల్లో 26 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అదేవిధంగా గతంలో శస్త్రచికిత్సకు ఇష్టపడని లేదా వైద్యపరంగా అనర్హులుగా గుర్తించిన వారిలో 51 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వైద్యుల పరీక్షల అనంతరం 15 మంది రోగులను శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. మరో 10 మంది రోగులు శస్త్రచికిత్సకు అనర్హులు (Unfit) గా గుర్తించారు. అదేవిధంగా 40 మంది రోగులను జనరల్ ఫిజీషియన్ పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా అవసరమైన మందులు మరియు కళ్లద్దాలు అందించారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంతో పాటు, అవసరమైన వారికి తదుపరి చికిత్స మరియు శస్త్రచికిత్స సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.































