[t4b-ticker]

గణేశ్ విగ్రహాల ఎత్తుపై కీలక ఆదేశాలు..

ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గణేశ్ విగ్రహాల తయారీదారులకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే గణేశ్ విగ్రహాల ఎత్తు 16 అడుగులకు మించకూడదని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించినట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది భారీ విగ్రహాల రవాణా సమయంలో నాలుగు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేసిన ఆయన, ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విగ్రహాల రవాణా సమయంలో విద్యుత్ తీగలు, ఫ్లైఓవర్లు, మెట్రో నిర్మాణాలు వంటి ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

అలాగే తయారు చేస్తున్న విగ్రహాల సంఖ్య, ఎత్తు, బుకింగ్ వివరాలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు అందించాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరిగేలా తయారీదారులు, నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరారు.

Spread the love

Related News

Latest News