పారదర్శక పాలనకు ఆర్టీఐ బ్రహ్మాస్త్రం – ఆర్డీఓ వందనపు శ్రీదేవి

*చండూరు లో ఆర్టీఐ వారోత్సవాలు – సమాచార హక్కుపై అవగాహన సదస్సు.

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 09 : ప్రజలకు పారదర్శక పాలన అందించడంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) బ్రహ్మాస్త్రం లాంటిదని చండూర్ ఆర్డీఓ వందనపు శ్రీదేవి అన్నారు. ఆర్టీఐ వారోత్సవాలు – 2026 వేడుకల్లో భాగంగా చండూర్ డివిజన్ స్థాయి ఆర్టీఐ అవగాహన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి పీఐఓ, ఏపీఐఓ కు ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన ఉండాలని, ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా, ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో చండూర్ డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, పీఐఓలు, ఏపీఐఓలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News