అనాథలైన చిన్నారులకు అండగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

*నెలకు రూ.20 వేల ఆర్థిక సహాయం ప్రకటన.

ప్రతిపక్షం చండూరు నవంబర్ 02: నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఈదాసు అమల గత సంవత్సరం మృతి చెందగా, ఆమె భర్త ఈదాసు లింగస్వామి గత రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. దీంతో వారి పిల్లలు సాత్విక, తనుష్ కుమార్ లు అనాథలుగా మారారు.ఈ విషయం స్థానిక నాయకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే గారు ఆదివారం వారిని పిలిపించుకొని, పిల్లలకు నెలకు వారి ఖర్చుల నిమిత్తం రూ. 20,000 రూపాయలు ఫైనాన్స్ పరంగా ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామస్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి నాయకులు కొండారెడ్డి, జాన్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గుజ్జల శ్రీనివాస్ రెడ్డి, దేవాలయ మాజీ చైర్మన్ గుజ్జల కృష్ణారెడ్డి, గుండ్రెడ్డి రామలింగా రెడ్డి, సంజీవరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News