కరీంనగర్ హెలిప్యాడ్‌లో పంది హల్‌చల్!

  • నితిన్ నబిన్ తిరుగు ప్రయాణానికి ముందు కలకలం.. – పందిని బయటకు పంపేందుకు సిబ్బంది తంటాలు

ప్రతిపక్షం, నవంబర్ 23, కరీంనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో కరీంనగర్ హెలిప్యాడ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హెలిప్యాడ్ ప్రాంగణంలోకి ఓ పంది ప్రవేశించి హల్‌చల్ సృష్టించింది. గ్రౌండ్‌లో అటూ ఇటూ పరుగులు పెడుతూ అక్కడి సిబ్బందిని హైరానాకు గురిచేసింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పందిని బయటకు పంపేందుకు నానా తంటాలు పడ్డారు. కొద్దిసేపు పంది పరుగులతో హెలిప్యాడ్ వద్ద సందడి నెలకొంది. ప్రముఖ నాయకుడి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ పంది ప్రవేశించడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.

Related News

Latest News