తాగునీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన..

— నీటి పొదుపుపై ప్రతిజ్ఞ.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్,23: ప్రాథమిక పాఠశాల ఎస్. ఆర్.ఎస్.పి, క్యాంప్ గడి కల్లూరు రోడ్ కోరుట్ల పాఠ శాల ఉదయపు సమావేశం లో విద్యార్థులకు రాబోయే ఎల్ నినో (El Niño) ప్రభావం, వర్షపాత లోటు, భవిష్యత్తులో తలెత్తే నీటి ఎద్దడి పరిస్థితుల గురించి ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, వివ రించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, నీటి వనరులను సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేస్తూ విద్యార్థులందరితో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించా రు. చిన్నతనం నుంచే నీటిని పొదుపు చేసే అలవాటును పెంపొందించుకోవాలని,నీటి ప్రాముఖ్యతను కుటుంబ సభ్యులకు, సమాజంలోని ఇతరులకు తెలియజేయా లని సూచించారు.నీటిని కాపాడుకుందాం భవిష్యత్తు తరాలకు భరోసా కల్పిద్దాం అనే సందేశంతో కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్య క్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు అబ్దుల్ రహూఫ్, పూర్ణ చందర్, ధన లక్ష్మి, సుమలత, సరస్వతి, శ్రీనివాస్, రాజ్ కుమార్ ఇన్స్ట్రక్టర్ ప్రసన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News