Trending Now

ఖానాపూర్ పురపాలక సంఘం సర్వ సభ్యుల సమావేశం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం ,ఖానాపూర్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలో జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి పనులపై, వార్డులలో ఉన్న పలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకొని ముదుకెళ్తున్నామని చెప్పారు. పట్టణాన్ని అన్ని రంగాలలో శోభయామానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరిగుతుందని పేర్కొన్నారు.మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం నిర్వహించామని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్స్ కారింగుల సంకీర్తన సుమన్, జన్నరపు విజయలక్ష్మి శంకర్, నాయిని స్రవంతి సంతోష్ పరిమి లత సురేష్, అఫ్రీన్ అమనుల్లా ఖాన్ , కిషోర్ నాయక్, అబ్దుల్ ఖలీల్ ,కుర్మా శ్రీనివాస్, పౌజియ షబ్బిర్ పాష, కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్ , మాలన్ బేగం,మున్సిపల్ కమిషనర్ మనోహర్, మున్సిపల్ ఏఇ తిరుపతి , మున్సిపల్ మేనేజర్ సురేందర్, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్, మున్సిపాలిటీ అధికారులు సంతోష్, తదితరులు పాల్గొన్నారు

Spread the love

Related News

Latest News