Trending Now

TSPSC: గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు.. టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

ప్రతిపక్షం, తెలంగాణ: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్పీ) బిగ్ షాకిచ్చింది. 2022 ఏప్రిల్‌లో వేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 503 గ్రూప్-1 ఉద్యోగా భర్తీ కోసం 2022 ఏప్రిల్‌లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను టీఎస్పీఎస్పీ రెండు సార్లు నిర్వహించగా.. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా ఎగ్జామ్ క్యాన్సిల్ కాగా.. రెండవసారి పరీక్ష నిర్వహణలో సరైన నిబంధనలు పాటించలేదని తెలంగాణ హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఇటీవల అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాత 503 పోస్టులతో పాటు ఆర్థిక శాఖ అనుమతించిన కొత్త 63 పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Spread the love