- హైదరాబాద్ లో నిన్న రాత్రి 8 గంటలకు మర్యాదపూర్వక భేటీ.
- ప్రజా ప్రభుత్వం వచ్చాక జరిగిన పరిణామాలపై కూలంకష చర్చ.
- రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలపై సానుకూలంగా స్పందించిన ఇన్చార్జి.
ప్రతి పక్షం మునుగోడు నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సందీప్ కుమార్ ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్ లో నిన్న రాత్రి 8:00 గంటలకు జరిగిన ఈ భేటీ సుమారు గంటసేపు కొనసాగింది.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు జరిగిన పరిణామాల గురించి ఈ భేటీలో కూలంకషంగా చర్చించారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఇన్చార్జికి రాజగోపాల్ రెడ్డి వివరంగా విన్నవించారు.రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలపై ఇన్చార్జి సందీప్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


























