చండూరు మార్కండేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

  • కార్తీక దీపాలతో వెలిగిపోయిన ఆలయ ప్రాంగణం.
  • ప్రత్యేక అభిషేకాలు, అర్చనల్లో పాల్గొన్న భక్తజనం- వేకువజాము నుంచే పోటెత్తిన భక్తులు
  • శివనామస్మరణతో మార్మోగిన ఆలయం

ప్రతి పక్షం చండూరు నవంబర్ 24: చండూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి.పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది.పౌర్ణమి సందర్భంగా అర్చకులు గుర్రం సత్యనారాయణ పంతులు స్వామివారికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తుల శివనామస్మరణతో, దీపాల కాంతులతో దేవాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

Related News

Latest News