ప్రతిపక్షం, నవంబర్ 02: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రాజకీయంగానే కాకుండా సినీ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నగరంలో బీజేపీ నిర్వహించనున్న మహా పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న అమిత్ షా, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా ప్రసంగించనున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులతో సమావేశం కానున్నట్లు సమాచారం.
ఈ భేటీల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌తో కూడా అమిత్ షా సమావేశం కానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో చర్చించనున్న అంశాలపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. అమిత్ షా పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో చిరంజీవి, రామ్‌చరణ్‌లతో ఆయన భేటీ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.



























