పత్తి సాగులో అధిక సాంద్రతతో అధిక లాభం

*కస్తాల రైతు వేదికలో కపాస్ కాంతి పథకంలో భాగంగా రైతులకు అవగాహన సమావేశం

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 09: చండూరు మండలం కస్తాల గ్రామంలో కపాస్ కాంతి పథకంలో భాగంగా రైతులకు అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. మహేష్ లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మల్లేష్ మాట్లాడుతూ అధిక సాంద్రత, దగ్గర దగ్గరగా విత్తే పత్తి సాగు చేయడం వల్ల పత్తి పంట ఒకేసారి చేతికి వస్తుందని తెలిపారు. దీని ద్వారా పంట త్వరగా పూర్తయి అదే పొలంలో ఇంకొక పంటను వేసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు.

ఈ విధానంలో ఒక ఎకరానికి 40 వేల మొక్కలు ఉంటాయని, సాధారణంగా సాగు చేసే పత్తి విధానం కంటే మూడు రెట్లు ఎక్కువ మొక్కలు ఉండడం జరుగుతుందని, సాధారణ పత్తి సాగులో వచ్చే దిగుబడి ఈ విధానంలో కూడా ఒకేసారి వస్తుందని వివరించారు.

ప్రస్తుతం పత్తి పంట పెట్టకు గురైందని, రైతు సోదరులు 2 శాతం యూరియా లేదా మల్టీకే వంటి పోషకాలను స్ప్రే చేసుకోవాలని సూచించారు. వచ్చే యాసంగి సీజన్ లో బోర్ల కింద ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేసుకోవద్దని, దానికి బదులుగా ఆరుతడి పంటలైన పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న వంటి పంటలు వేసుకోవడం మేలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాల రవీందర్ రెడ్డి ,కట్ట నరసింహ, గొంది శ్రీనివాస్ రెడ్డి , మాధవ రెడ్డి ,మహేష్ , యాదయ్య , రమేష్ ,జంగయ్య ,గోవర్ధన్ ,పిన్నపురెడ్డి ఉపేందర్ రెడ్డి,బిక్సమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News