ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి ఘన విజయం.

*గెలిపించిన కార్మికులకు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందనలు.

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 10: ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ (EU–NMU–TMU) కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందనలు తెలిపారు.కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఎంప్లాయిస్ యూనియన్ కూటమిపై కార్మికులు మరోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అద్దె సంఘాలకు మద్దతు ఇచ్చి ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆర్టీసీ కార్మికులు తమ ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పారని నెల్లికంటి సత్యం అన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సంఘాలకే కార్మికులు మద్దతుగా నిలుస్తారని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, వేతనాలు, మెరుగైన పని పరిస్థితుల సాధన కోసం ఎంప్లాయిస్ యూనియన్ కూటమి గతంలో అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించే సంఘాలకు కార్మికుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ విజయం స్పష్టం చేసిందన్నారు.ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతూ వారి హక్కుల సాధనకు కృషి చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ కూటమికి ఆయన సూచించారు.

Spread the love

Related News

Latest News