Hydra demolitions.. High Court notices to Telangana government: హైడ్రా కూల్చివేతలు చట్టవిరుద్ధమని, వాటిని వెంటనే నిలిపివేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఇప్పటికప్పుడు కూల్చివేతలు ఆపలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అనంతరం ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.