Jaishankar will go to Pakistan: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో రెండురోజులపాటు ఆయన పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్సీఓ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సంస్కృతిక, మానవతా సహకారంపై చర్చించనున్నారు.